Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరకాలలో రూ. 42.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

పరకాలలో రూ. 42.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

వతెలంగాణ - పరకాల : పరకాల మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన పట్టణంలో రూ.

42.50 లక్షల టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక సీఎస్ఐ స్కూల్ నుండి పిడుగు బండ వరకు నిర్మించ తలపెట్టిన ఈ రహదారి పనులను ఆయన మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ఈ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక శ్మశాన వాటికలకు వెళ్లే ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. పట్టణ సమగ్రాభివృద్ధికి మున్సిపాలిటీ నిరంతరం కట్టుబడి ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతుల కల్పన పనులను చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఏకు దివ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్ కుమార్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు మెరుగు శ్రీశైలం పాల్గొన్నారు. అలాగే వార్డు కౌన్సిలర్లు దుబాసి వెంకటస్వామి, బొచ్చు శ్యామల, బెజ్జంకి పూర్ణాచారి, గుడేల్లి సదానందం, ఆకుల లావణ్య, బొచ్చు మాధవిలత, కుక్కల విజయ్ కుమార్, బండి శ్రీధర్, బొచ్చు సుభద్ర, కొయ్యడ శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనివాస్, సూదమల్ల రమేష్, అల్లె దశరథం పాల్గొన్నారు. వీరితో పాటు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సిహెచ్. రంజిత్, గంజి వెంకట్ రెడ్డి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్, వివిధ కుల సంఘాల నాయకులు మరియు స్థానిక కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana