Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరిశ్రమలో రసాయన వాయువు లీక్.. ఊపిరాడక ముగ్గురి మృతి

పరిశ్రమలో రసాయన వాయువు లీక్.. ఊపిరాడక ముగ్గురి మృతి

వతెలంగాణ - హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడేచూరు-బాడియాల పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో ఇవాళ వేకువజామున రసాయన వాయువు లీకై ముగ్గురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు.

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్తో పాటు మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్లుగా గుర్తించారు. వీరంతా 20 నుంచి 25 ఏండ్ల లోపు యువకులే. ఈ ప్రమాదంలో గాయపడిన ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్లను మెరుగైన వైద్యం కోసం రాయచూర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana