Dailyhunt
పరిస్థితి విషమించి వ్యక్తి మృతి..

పరిస్థితి విషమించి వ్యక్తి మృతి..

వతెలంగాణ-బెజ్జంకి : ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.స్థానికుల వివరాల మేరకు జనాగం పోచయ్య(47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.గత కొద్ది కాలంగా ఆర్థిక ఇబ్బందులతో అందోళన గురవుతూ..ఈ నెల 4న బార్య లేని సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగాడని తెలిపారు.గమనించిన చుట్టుపక్కల స్థానికులు మేరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ యందు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి పోచయ్య మృతి చెందినట్టు తెలిపారు.మృతునికి ఇద్దరు కూతుర్లు,కుమారుడు సంతానం.మృతుని బార్య లక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సౌజన్య తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana