Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది`లాంటి సినిమాలుదశాబ్దానికి ఓసారి వస్తాయి

'పెద్ది`లాంటి సినిమాలుదశాబ్దానికి ఓసారి వస్తాయి

'అందరికీ ఒక ఐడెంటిటీ కావాలి. అలాంటి ఐడెంటిటీ కోసం చేసే ప్రయాణం. ఈ కథని దర్శకుడు చాలా ఆర్గానిక్గా, అలాగే హైలీ కమర్షియల్గా చూపించారు. ప్రేక్షకులందరూ చాలా సర్ప్రైజ్ అవుతారు.

నా కెరీర్లో చేసిన మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ ఇది. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. 'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. 'పెద్దికూడా లాంటి అరుదైన సినిమా అని హీరో రామ్ చరణ్ అన్నారు. దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కించిన రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ,'బుచ్చిబాబుకి ఒక విషయంలో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. రెహమాన్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చేలా కన్వీన్స్ చేశారు (నవ్వుతూ). ఆయన 'పెద్ది'లో భాగం కావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. జాన్వి తన పాత్రను ఎంతో నిజాయితీగా చేసింది. మా నాన్న, శ్రీదేవి కలిసి సినిమాలు చేశారు. జాన్వి, నేను కలిసి నటించాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుం టున్నారు. మంచి సినిమాలు అంత ఈజీగా రావు. 'మగధీర' చేసిన 10 ఏళ్ల తర్వాత 'రంగస్థలం' వచ్చింది. తర్వాత 'ఆర్ఆర్ఆర్ వచ్చింది. లక్కీగా 'పెద్దిత్వరగానే వస్తుంది. ఇది నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే సినిమా అని తెలిపారు.

'బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడు ఆయన కళ్లలో ఉన్న ప్యాషన్ చూశాను. అప్పుడే ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా కావాలని అనిపించిందిఅని ఏఆర్ రెహమాన్ చెప్పారు. నిర్మాత సతీష్ కిలారు మాట్లాడుతూ,'ఇది ఒక అద్భుతమైన సినిమా. జూన్ 4 నుంచి ఇది మీ సినిమా అవుతుంది. 'రంగస్థలం' సమయంలో రామ్ చరణ్ 'మీతో ఒక సినిమా చేస్తాను' అన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు అని తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ,'నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. జాన్వి చాలా హార్డ్వర్కింగ్. రెహమాన్ తో పని చేయడం నా డ్రీమ్` అని తెలిపారు. 'బుచ్చిబాబు చాలా రౌడీ డైరెక్టర్ (నవ్వుతూ). రెహమాన్ మ్యూజిక్ చేసిన ఈ సినిమాలో అలాగే రామ్ చరణ్ తో కలిసి పని చేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. 'పెద్ది' నాకు చాలా స్పెషల్ సినిమా`. హీరోయిన్ జాన్వి కపూర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana