Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

- ముగ్గురు అరెస్ట్.. రూ.5,500 నగదు, రెండు బైక్ లు స్వాధీనంనవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు అశ్వారావుపేట ఎస్ఐ యయాతి రాజు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేపట్టారు.

ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,500 నగదు, రెండు మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పేకాట,కోడిపందాలు వంటి అక్రమ జూద కార్యకలాపాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే డయల్ - 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana