Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి

వతెలంగాణ-ఆలేరు టౌను పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను బేశరథిగా ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తూ, ఆలేరు పట్టణంలో శనివారం రైల్వే గేట్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి ప్రజలకు అదనపు ఆర్థిక భారాన్ని మోపడం అలవాటుగా చేసుకున్నదని,అందుకే బీ జే పీ మోడీ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాల్సిన జరూరు కర్తవ్యం ప్రజలపై ఉన్నదని, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. దేశంలో ప్రజలు పెట్రోల్,డీజిల్ ఇతర వస్తువులను పొదుపుగా వాడాలని చెప్పి ఈ విధంగా ధరలను పెంచడం ప్రజా వ్యతిరేక విధానాలలో భాగమని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో చమురు ముడిసరుకు ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు లేనప్పటికీ కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడమంటే ఇంధన పెరుగుదలపై గణనీయమైన శాతం లో ప్రజలపై భారాన్ని మోపి లక్షల రూపాయలను కేంద్రం లాభాలను గడిస్తుందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు.కూలీ సంఘం(ఏ ఐ కే ఎం ఎస్)రాష్ట్ర అద్యక్షులు మామిడాల భిక్షపతి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు కల్లేపు అడివయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చిర బోయిన రాజయ్య,జిల్లా నాయకులు చిర బోయిన కొమురయ్య,మామిడాల బాల మల్లేష్, తమ్మడి అంజయ్య, కొమ్మిడి గోపాల్ రెడ్డి,టంగుటూరు మాజీ సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి, అయిల యాకయ్య, చిన్నం సత్యనారాయణ, మామిడాల రాజు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana