Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

- రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తినవతెలంగాణ - మిరుదొడ్డి
సిద్దిపేట జిల్లా ములుగులో నిర్వహించిన ఇందిరమ్మ గృహాల పథకం కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలతో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు,డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టా ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు.దుబ్బాక నియోజకవర్గంలో పేద కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నందున ఇందిరమ్మ గృహాల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించి,మరిన్ని ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే గతంలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటికీ పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. బిల్లులు విడుదలైతే పేద కుటుంబాలకు ఎంతో ఊరట కలుగుతుందని అన్నారు.ఇందిరమ్మ గృహాల అమలులో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన వారికే లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపిక ప్రక్రియ నుంచి నిధుల విడుదల వరకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్న ఎమ్మెల్యే, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana