Dailyhunt
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి: జస్టిస్ లక్ష్మణ్

పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి: జస్టిస్ లక్ష్మణ్

హైదరాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ ప్రాంగణంలో శనివారం జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, జీతేశ్‌ వి పాటిల్ హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ కూడా న్యాయమూర్తితో భేటీ అయ్యారు. జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ ఆదేశాలు ఇచ్చారు. న్యాయ సేవా అధికార సంస్థ నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana