Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెన్షన్ లబ్ధిదారులకు ప్రత్యక్ష ధృవీకరణ

పెన్షన్ లబ్ధిదారులకు ప్రత్యక్ష ధృవీకరణ

వతెలంగాణ-రాయికల్: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కోర్ బ్యాంకింగ్ సేవల కింద పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రత్యక్ష ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ టీ మనోహర్ గౌడ్ తెలిపారు.ఈ మేరకు రాయికల్ పట్టణంలోని పెన్షన్ లబ్ధిదారులకు ఈనెల 16 నుంచి జూన్ 10 వరకు మున్సిపల్ కార్యాలయ వార్డు అధికారులు ఇంటింటికి వెళ్లి ముఖ గుర్తింపు విధానం,బయోమెట్రిక్ వేలిముద్రల ద్వారా మొబైల్ అనువర్తనం సహాయంతో ప్రత్యక్ష ధృవీకరణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.మరణించిన వ్యక్తుల పేర్లపై పెన్షన్ విడుదల కాకుండా నిరోధించడం,అర్హులైన కొత్త లబ్ధిదారులకు పెన్షన్ మంజూరుకు అవకాశం కల్పించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.పట్టణంలోని పెన్షన్ లబ్ధిదారులు సంబంధిత సిబ్బందికి సహకరించి ప్రత్యక్ష ధృవీకరణ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana