హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ కాలనీగా కొండపోచమ్మ సాగర్ జలాశయం నిర్వాసితుల కోసం నూతనంగా నిర్మించిన తునికి బొల్లారం పీఅండ్ఆర్ కాలనీ నిలుస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. సోమవారం పీ అండ్ ఆర్ కాలనీని ఆయన సందర్శించారు. కాలనీలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను గురించి సీఎస్‌కు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివరించారు. కాలనీలోని మౌలిక సదుపాయాలు, ఇండ్లను పరిశీలించారు. కాలనీలో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని, కాలనీ లే అవుట్, అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని వారు సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం భూ నిర్వాసితులతో సీఎస్ మాట్లాడారు. వారి వెంట రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి ఉన్నారు.

