Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిడుగుపాటుకు మూడు పశువులు మృత్యువాత

పిడుగుపాటుకు మూడు పశువులు మృత్యువాత

వతెలంగాణ-అచ్చంపేటఅచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన రైతు బద్ధుల శేఖర్కు చెందిన మూడు పశువులు శుక్రవారం పిడుగుపాటుకు మృతివాత చెందాయి. రైతు తన వ్యవసాయ పొలంలో కట్టివేసిన పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో అవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.

మృతి చెందిన పశువులను చూసి రైతు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వ్యవసాయ పనులకు, కాడెద్దులుగా ఆధారంగా ఉండే పశువులు కోల్పోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి రైతు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana