Dailyhunt
పొంచిఉన్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు

పొంచిఉన్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు

వతెలంగాణ - మిరుదొడ్డి వ్యవసాయ పంట పొలాల్లో చేతికి తాకేంత ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలు ప్రమాదగంటికలు మోగిస్తున్నాయి. ఈ తీగల కింద వ్యవసాయం చేయాల్సి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళనతో పనులు చేయాల్సి వస్తోంది. మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బోయిని బొందయ్య తన వ్యవసాయ పొలంలో వేలాడుతున్న కరెంటు తీగలను తొలగించాలని పలుమార్లు అధికారులను కోరినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నాడు. దీంతో పంటపనులు చేయడం కష్టంగా మారిందని, ఎప్పుడు ప్రాణాపాయం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంటు తీగలను వెంటనే సరిచేసి రైతుల ప్రాణాలను కాపాడాలని బాధిత రైతు కోరుతున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana