Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోరాడి ఓడిన అష్మిత

పోరాడి ఓడిన అష్మిత

లేషియా మాస్టర్స్ సూపర్ 500కౌలాలంపూర్ (మలేషియా) : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, వరల్డ్ నం.71 అష్మిత చాలిహ పోరాటం ముగిసింది. మలేషియా మాస్టర్స్ మహిళల సింగిల్స్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచి క్వార్టర్ఫైనల్కు చేరుకున్న అష్మిత చాలిహ..

సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోవటంలో విఫలమైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ చేతిలో అష్మిత మూడు గేముల ఉత్కంఠ పోరులో పోరాడి ఓడింది. గంటకు పైగా సాగిన మ్యాచ్లో 23-21తో తొలి గేమ్ను ట్రైబేకర్లో సాధించిన అష్మిత.. ఆ తర్వాత వరుస గేముల్లో నిరాశపరిచింది.

18-21, 11-21తో అష్మిత ఆశించిన పోరాట పటిమ చూపించలేదు. గాయంతో ఎనిమిది నెలల విరామం తీసుకున్న అష్మిత్ రీ ఎంట్రీలోనే అదరగొట్టింది. సూపర్ 500 టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్కు చేరుకుని ర్యాంక్ను మెరుగుపర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మలేషియా మాస్టర్స్లో అష్మిత మినహా ఇతర షట్లర్లు క్వార్టర్స్కు చేరటంలో విఫలమయ్యారు. అష్మిత ఓటమితో మలేషియా మాస్టర్స్లో భారత పోరాటానికి తెరపడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana