Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలి..

ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలి..

- ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించాలి
- టీపీఏ రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానం
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నారాయణ, పద్మారెడ్డి ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) డిమాండ్‌ చేసింది.

ఆయా బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేయాలనీ, శానిటేషన్‌ సిబ్బందిని నియమించి వసతులు మెరుగుపరచాలని కోరింది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చట్టం రూపొందించి, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నాగటి నారాయణ అధ్యక్షతనత జరిగిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా, ప్రయివేటు విద్యాలయాల అరాచకాలను అరికట్టకుండా వ్యహరిస్తున్న టీఆరెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల సమావేశం తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన చదువు లేక, ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల బెడదను తట్టకోలేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సమావేశంలో నూతన రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీపీఏ అధ్యక్షులుగా నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శిగా సల్లారపు పద్మారెడ్డి, కోశాధికారిగా రజినీ దేవితో సహా ఐదుగురు ఉపాధ్యక్షులు, మరో ఐదుగురు కార్యదర్శులుగా మొత్తం 13 మంది ఎన్నికయ్యారు.

- ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించాలి
- టీపీఏ రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానం
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నారాయణ, పద్మారెడ్డి ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) డిమాండ్‌ చేసింది. ఆయా బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేయాలనీ, శానిటేషన్‌ సిబ్బందిని నియమించి వసతులు మెరుగుపరచాలని కోరింది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చట్టం రూపొందించి, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నాగటి నారాయణ అధ్యక్షతనత జరిగిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా, ప్రయివేటు విద్యాలయాల అరాచకాలను అరికట్టకుండా వ్యహరిస్తున్న టీఆరెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల సమావేశం తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన చదువు లేక, ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల బెడదను తట్టకోలేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సమావేశంలో నూతన రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీపీఏ అధ్యక్షులుగా నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శిగా సల్లారపు పద్మారెడ్డి, కోశాధికారిగా రజినీ దేవితో సహా ఐదుగురు ఉపాధ్యక్షులు, మరో ఐదుగురు కార్యదర్శులుగా మొత్తం 13 మంది ఎన్నికయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana