నవతెలంగాణ-వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యనభ్యసించిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామస్తుల సమక్షంలో మంగళవారం విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
రేవల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 25 మంది విద్యార్థులు విద్యనాభ్యసించారు. 2026 మార్చ్ లో నిర్వహించిన పదవ తరగతి బోర్డు పరీక్షల్లో హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ అధ్యక్షతన విద్యార్థులను అభినందిస్తూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి కుటుంబానికి గ్రామానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టప్పా రాజయ్య, ఏ ఏ పీ సి చైర్మన్ వెంకటమ్మ, ఏ ఎం ఓ మహానంది, సి ఎం ఓ ప్రతాప్ రెడ్డి, వార్డెన్ జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

