Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై అవగాహన

ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై అవగాహన

వతెలంగాణ - పెద్దకొడప్ గల్ ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కాటేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడవరోజు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తల్లితండ్రులకు ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను వివరించారు.

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లి తండ్రులకు విజ్ఞప్తి చేశారు .విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిపామ్స్, మధ్యాహ్న భోజనం, రాగి జావా, అందిస్తామని తెలియచేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఏఐ విద్యను ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఏ పీసీ చైర్మన్ భానుబేగం, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాలరాజు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana