Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసించాలి

- సీఐటీయూ జిల్లా నాయకులు కీలుకానీ లక్ష్మణ్‌
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఆదివారం నిర్వహించనున్న సేవ్‌ ఇండియా కోసం చేపడుతున్న జైల్‌ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కీలుకానీ లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వాలు వారికి గుదిబండగా మారాయని విమర్శించారు. పెట్రోలు ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గిపోయినా తమ ప్రభుత్వాలు మాత్రం రోజురోజుకూ ధరలు పెంచుతూ.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతుండంతో పేద, మధ్య తరగతి ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందో ళన వ్యక్తంచేశారు.

ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరస నగా సీఐటీయూ, ఏఐకేఎస్‌, డీివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ ఐ, కేవీ పీఎస్‌, పీఎన్‌ఎం, టీజీఎస్‌ సంఘాల సంయుక్త ఆధ్వ ర్యంలో షాపూర్‌నగర్‌ సాగర్‌ హౌటల్‌ వద్ద సేవ్‌ ఇండి యా, జైల్‌ బారో కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana