Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రైవేటు బస్సు బోల్తా.. 30మందికి గాయాలు

ప్రైవేటు బస్సు బోల్తా.. 30మందికి గాయాలు

శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పెద్దినాయుడుపేట వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోల్తాపడిన బస్సు బెంగళూరు నుంచి కలకత్తా వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana