Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజా సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తాం

ప్రజా సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తాం

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక @99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు.

ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి సమావేశం నిర్వహించగా, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని, త్వరలో ప్రభుత్వం 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

పింఛన్ దారుల జీవన ప్రామాణికరణ ప్రక్రియ కొనసాగుతుందని, నూతన పింఛన్ల కొరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పెద్దా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ ఫలాన్ని అర్హులైన ప్రతి పేద ప్రజలకు అందేలా సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ లు గ్రామాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉందని అడిగి తెలుసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు దాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలే కాకుండా గ్రామాల అభివృద్ధి కొరకు అనేక నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను అమలు చేస్తుందన్నారు.

తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ గృహజ్యోతి పథకంలో అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ వ్యాపార రంగాలలో రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందని. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించి చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.

భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా రైతు భరోసా, రైతు బీమా పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని, సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అదనంగా రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన నిరుపేదలు గౌరవంగా జీవించడం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుంది .విద్య రంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, ప్రాథమిక పాఠశాల నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పిల్లలలో పోషకాహార లోపాన్ని నియంత్రించేందుకు ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నియోజకవర్గ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరీచేయడం జరిగిందని అన్నారు.

ఈ పాఠశాలల ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి బీమా సదుపాయం కల్పించేలా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఎక్కడైనా నీటి సమస్య వస్తే వెంటనే సమస్య పరిష్కరించడానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులను నమోదయ్యేలా చూడాలన్నారు. గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో ఇంటర్మీడియట్ వరకు మంచి పౌష్టికాహారంతో భోజనం అందించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ కలెక్టర్ వెంకరెడ్డి,జెడ్పి సి ఈ ఓ శోభారాణి,గ్రంధాలయం చైర్మన్ అవేజ్ చిస్తీ, ఆలేరు, మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చైతన్యమహేందర్ , విమల వెంకటేష్,భువనగిరి, ఆలేరు,యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ లు తంగెల్లపల్లి శ్రీవాణి, బాలమణి భాస్కర్, గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, డి ఆర్ డి ఏ నాగిరెడ్డి, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana