నవతెలంగాణ - జుక్కల్ మండలంలోని ప్రజాపాలన- పల్లె ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో జుక్కల్ మండలానికి చెందిన 30 గ్రామాల గ్రామపంచాయతీ సర్పంచ్ లతో పాటు ప్రజా ప్రతినిధులు శుక్రవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జుక్కల్ మండల ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని జుక్కల్ మండల్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాకలి తీసిన ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ఇది సదవకాశమని ఈ అవకాశాన్ని ప్రజాప్రతినిధులు సర్పంచులు ఉపయోగించుకుని ప్రజలకు చేరువయ్యే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 30 గ్రామాల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

