Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే నిరసన.. ఆవేశంతో మైక్ ధ్వంసం

ప్రజాపాలన సభలో ఎమ్మెల్యే నిరసన.. ఆవేశంతో మైక్ ధ్వంసం

డ్లు వెంటనే కొనాలంటూ స్టేజీ కింద కూర్చొని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళననవతెలంగాణ - మిరుదొడ్డి
ప్రజాపాలపై ఉన్న ధ్యాస ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతుల వద్ద కనుగోలుపై లేదని బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు.

ఈ ధర్నాకు దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజా పాలన సభలో నిరసన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం రసాభాసగా మారింది. వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేజీ కింద కూర్చొని నిరసన తెలిపారు. ఆవేశంతో స్టేజీపై మైక్ పగలగొట్టడంతో కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. 99 రోజుల ప్రజా పాలనపై దుబ్బాక నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాసేపు స్టేజీపై కూర్చున్నారు.

అనంతరం స్టేజీ కిందికి వచ్చి బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలంటూ నిరసనకు దిగారు. మళ్లీ స్టేజీపైకి వెళ్లి మాట్లాడుతున్న సమయంలో మైక్ ను కట్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేశంతో మైకులు ధ్వంసం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 'సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయితే, అందులో 2 లక్షల మెట్రిక్ టన్నులు మా దుబ్బాక నియోజకవర్గంలోనే పండింది. ఇది కేవలం మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ద్వారా ఇచ్చిన నీటి ఫలితం' అని అన్నారు. 'నెల రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని, ప్రభుత్వం ఏదో ఉద్ధరిస్తుందనే ఉద్దేశంతో 99 రోజుల పాలనపై సమావేశం పెట్టింది, కానీ గ్రామాల్లో రైతులు ప్రజా పాలన కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. మాకు ప్రజా పాలన కాదు, రైతులు ముఖ్యం' అని స్పష్టం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana