Dailyhunt
ప్రజాపాలనలో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి: సర్పంచ్ మధు

ప్రజాపాలనలో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి: సర్పంచ్ మధు

వతెలంగాణ - ఆలేరు రూరల్ : ప్రజాపాలనలో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ కంటి మధు అన్నారు.ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలోc గురువారం తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు.ఈ సమావేశానికి గ్రామ ప్రజలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కంతి మధు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ వంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ ద్వారానే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రతి సమస్యను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని కూడా అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూడల శ్రీధర్, వార్డ్ సభ్యులు చిలుకు నిరోష,బండ శ్రీను, భోధస్ సంధ్య, కంతి బిక్షపతి, కంతి బలరాజు, చిలుకు ప్రశాంత్,పుట్టల సునీత,పెండ్యాల నాగరాజు,దూడల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana