Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజారోగ్యంపై ఎమ్మెల్యే జారె ప్రత్యేక శ్రద్ధ

ప్రజారోగ్యంపై ఎమ్మెల్యే జారె ప్రత్యేక శ్రద్ధ

- నిమ్స్లో పలువురు అనారోగ్య బాధితులను పరామర్శనవతెలంగాణ - అశ్వారావుపేట

శ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు.

ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం తరఫున అందుతున్న వైద్య సహాయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన గట్టిగొర్ల మహాలక్ష్మమ్మ, చండ్రుగొండ మండలం అన్నారంతండాకు చెందిన బానోత్ దినేష్కు అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం నుంచి చెరో రూ.2.50 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షల ఎల్వోసీ చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.

అనంతరం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన ఇనుముల లక్ష్మయ్య, అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పామర్తి సుస్మిత, దమ్మపేట మండలం లచ్చాపురం దిబ్బగూడెం గ్రామానికి చెందిన గురింద గోపాలరావును ఎమ్మెల్యే పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana