Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజాస్వామ్య శవపేటికపై కొట్టే చివరి మేకు

ప్రజాస్వామ్య శవపేటికపై కొట్టే చివరి మేకు

జ్రాయిల్ ప్రభుత్వ నిర్ణయంపై 
రాజ్యాంగ నిపుణుల ఆందోళనటెల్ అవీవ్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకూడదని బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇజ్రాయిల్లో రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నిర్ణయం 'ప్రజాస్వామ్య శవపేటికపై కొట్టే చివరి మేకు' వంటిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు హెచ్చరించారు. టీవీ-రేడియో రెగ్యులేటరీ సంస్థలోని కొందరు సభ్యులు రాజీనామా చేసినప్పటికీ దాని కార్యకలాపాలు కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు గత నెల 17న ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటిని తమ ప్రభుత్వం గుర్తించబోదని ఇజ్రాయిల్ కమ్యూనికేషన్ల మంత్రి షలోమో కర్హీ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశం చట్ట వ్యతిరేకమని, అందుకే దానిని తాము అమలు చేయబోమని అన్నారు. ఈ మేరకు కర్హీతో పాటు న్యాయ శాఖ మంత్రి యారివ్ లెవిన్ సమర్పించిన డిక్లరేషన్ను ప్రభుత్వం ఆమోదించింది. కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయడానికి తమ వద్ద ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగించుకుంటామని తెలిపింది.

అరాచకానికి దారితీస్తుంది
మరోవైపు జెరుసలేంలోని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'ఇలాంటి వైఖరి దేశంలో సాధారణ పరిపాలనను, చట్ట వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. న్యాయస్థానం నిర్ణయాలను గౌరవించడానికి లేదా పాటించడానికి నిరాకరించడం ప్రజాస్వామ్య శవపేటికపై కొట్టే చివరి మేకు అవుతుంది' అని వారు ధ్వజమెత్తారు. 'ప్రభుత్వ నిర్ణయం అరాచకానికి, ప్రభుత్వ అధికారాల కేంద్రీకరణకు దారితీస్తుంది. సక్రమంగా పనిచేస్తున్న సమాజం మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది' అని మాజీ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా రెగ్యులేటరీ సంస్థకు చెందిన ఆరుగురు సభ్యులు రాజీనామా చేయడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. క్యాబినెట్ మంత్రుల ఒత్తిడి కారణంగానే వారు రాజీనామా చేశారని కోర్టు అభిప్రాయ పడింది. ఇదిలావుండగా సుప్రీంకోర్టు ఆదేశా లను ధిక్కరించబోమని కొందరు మంత్రులు, శాసనకర్తలు స్పష్టం చేశారని రాయిటర్స్, టైమ్స్ వార్తా సంస్థలు తెలియజేశాయి. న్యాయవ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నెతన్యాహూ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వివాదం చెలరేగింది. ఇజ్రాయిల్కు చెందిన రెండు టీవీ ఛానల్స్పై రెగ్యులేటరీ సంస్థలో విచారణ జరుగుతోంది. అక్టోబరులో జరిగే సార్వత్రిక ఎన్నికలలో నెతన్యాహూ ప్రభుత్వం ఓడిపోతుందని అంచనాలు వెలువడుతున్నాయి.

విమర్శల వెల్లువ
'చట్టాన్ని కాలరాసే అధికారం మీకు లేదు. చట్ట విరుద్ధంగా ఉన్న తీర్పును మేము గుర్తించం. మీ నిర్ణయాలు చెల్లవు' అంటూ కర్హి చేసిన వ్యాఖ్యపై స్థానిక మీడియా స్పందిస్తూ దేశ చరిత్రలోనే ఇలాంటి ప్రకటన ఇప్పటి వరకూ రాలేదని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు ఇసాక్ హెర్జాగ్, అటార్నీ జనరల్ గాలి బహరవ్-మియారా, ప్రతిపక్ష నేతలు తీవ్రంగా విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana