Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజావాణి అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలి

ప్రజావాణి అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలి

కలెక్టర్ గరిమ అగ్రవాల్నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల

ప్రజావాణి అర్జీలపై అధికారులు దృష్టి సారించి, పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 220 దరఖాస్తుల రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నేటి నుండి డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రతీ సోమవారం ఆర్డీఓ లు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రతీ సోమవారం నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana