Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ భారత గౌరవాన్ని చాటుతున్న జయసింహ

ప్రపంచ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ భారత గౌరవాన్ని చాటుతున్న జయసింహ

వరెస్ట్ లక్ష్యంగా అడుగులు… యువతకు స్ఫూర్తిగా సిమ్ లయన్ ఫిట్నెస్ వ్యవస్థాపకుడు
నవతెలంగాణ-నాచారం

సిమ్ లయన్ ఫిట్నెస్ వ్యవస్థాపకుడు, ఐరన్మ్యాన్, ఎండ్యూరెన్స్ అథ్లెట్ మరియు మౌంటెనీర్ అయిన కలాలి జయసింహ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ భారతదేశానికి గౌరవాన్ని తీసుకువస్తున్నారు.

కఠినమైన పరిస్థితుల్లో సాహస యాత్రలు చేపడుతూ ఆయన క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్లోని ఎల్బ్రస్, అర్జెంటీనాలోని అకాంకాగువా వంటి ప్రపంచ ప్రఖ్యాత శిఖరాలను విజయవంతంగా అధిరోహించిన జయసింహ, నేపాల్ మరియు లడాఖ్ ప్రాంతాల్లో కూడా అనేక క్లిష్ట పర్వత యాత్రలను పూర్తి చేశారు. 23,000 అడుగుల ఎత్తుకు పైగా ఉన్న శిఖరాలను అధిరోహించడం ఆయన క్రమశిక్షణ, ధైర్యం మరియు అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.తన విజయాలను ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మా రెడ్డికి అంకితం చేస్తూ ఆయన కృతజ్ఞతను తెలిపారు.

ఈ ప్రయాణంలో రాష్ట్ర నాయకులు సాయిజన్ శేఖర్ అందించిన ప్రోత్సాహం, సహకారం కీలకమని పేర్కొన్నారు.ఇటీవల ప్రముఖ నాయకుడు కే.టి. రామారావు ను కలిసిన జయసింహ, తన సాధనలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన విజయాలను ప్రశంసించిన కేటీఆర్, భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే లక్ష్యానికి తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జయసింహ మాట్లాడుతూ, 'నా ప్రయాణం కేవలం పర్వతాలను అధిరోహించడం కోసం కాదు, ప్రతి ఒక్కరినీ తమ పరిమితులను అధిగమించేలా ప్రేరేపించడం కోసం. మౌంట్ ఎవరెస్ట్ పై భారత జెండాను ఎగరవేయడం నా లక్ష్యం' అని అన్నారు.సిమ్ లయన్ ఫిట్నెస్ ద్వారా యువతలో ఫిట్నెస్, క్రమశిక్షణ, మానసిక ధైర్యంపై అవగాహన పెంచుతున్న జయసింహ, తన కృషితో ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చని సమాజానికి సందేశం ఇస్తున్నారు. రాబోయే ఎవరెస్ట్ యాత్ర ఆయన ప్రయాణంలో మరో కీలక ఘట్టంగా నిలవనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana