Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థను ఉపయోగించుకోండి

ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థను ఉపయోగించుకోండి

శ్రీచైతన్య కావూరి హిల్స్ జోన్ ఫ్రెషర్స్ వేడుకల్లో అతిథులునవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రీచైతన్య అందిస్తున్న ప్రపంచస్థాయి విద్యావ్యవస్థను విద్యార్థులు సరైన రీతిలో ఉపయోగించుకోవాలని పలువురు అతిథులు సూచించారు.

మంగళవారం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శ్రీచైతన్య కాపూరి హిల్స్ జోన్ రైజ్ ఆఫ్ అచీవర్స్ అండ్ రాక్ స్టార్స్ 2కె26 పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలతో పాటు ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ - 2026 ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, సైబరాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రీతిరాజ్ తో పాటు ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ హాజరయ్యారు.అతిథులు మాట్లాడుతూ భవిష్యత్ విజేతలను తీర్చిదిద్దడంలో శ్రీచైతన్య విద్యా సంస్థలు పడుతున్న శ్రమను కొనియాడారు. ఐఐజీ-జేఈఈ, నీట్ తదితర ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు ప్రతిఏటా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని వారు ప్రశంసించారు. ఇలాంటి వేడుకలు కేవలం విద్యా ప్రయాణానికి ఆరంభంగా నిలబడటమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపి ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ప్రేరణనిస్తాయని వారు తెలిపారు.
నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ ఓటమికి భయపడకుండా అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేయాలని, యువత తమ కలలను నిజం చేసుకునేంత వరకు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు. ఆయన తన ఉత్తేజపూరితమైన ప్రసంగంతో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.

శ్రీచైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన మాట్లాడుతూ 'జాతీయ స్థాయి ర్యాంక్ లలోనా, అగ్రశ్రేణి ఫలితాల్లోనా కాపూరి హిల్స్ జోన్ ఒక చిరునామాగా మారిందంటే, అది అక్కడి విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల నిరంతర తోడ్పాటు, టాప్ ర్యాంకులే లక్ష్యంగా రూపొందించిన ప్రోగ్రాంల ఫలితమే' అనితెలిపారు. శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ విద్యాభ్యాసంతో పాటు క్రమశిక్షణ, కష్టపడే తత్వం విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తాయని తెలిపారు.
శ్రీచైతన్య స్కూల్స్ అకాడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన మాట్లాడుతూ స్కూల్ స్థాయి నుంచే నుంచే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, విశ్లేష ణాత్మక ఆలోచన పెంచడం వల్ల కాపూరి హిల్స్ జోన్ జాతీయ స్థాయి విజయా లకు అడ్డాగా మారిందని తెలిపారు. శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ నాగేంద్ర జాతీయ స్థాయిలో రాణించా లంటే నిరంతర సాధన, సరైన ప్రణాళిక అవసరమని తెలిపారు. ప్రముఖ టీవీ యాంకర్, సినిమా నటుడు రవి ఈ కార్యక్రమానికి వాఖ్యాతగా వ్యవహరించారు. తన సమయస్ఫూర్తి, తనదైన శైలి పంచ్ లతో వేడుకకు మరింత వన్నె తెచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana