Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి..

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి..

వతెలంగాణ - మునుగోడు: ప్రభుత్వ పథకాల అన్నిటికీ ఫార్మర్ రిజిస్ట్రీని అనుసంధానం చేపడుతున్నందున ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎస్ పద్మజ కోరారు.

శుక్రవారం మండలంలోని గుడాపూర్ గ్రామంలో రైతు సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు ఎరువులను బుకింగ్ యాప్ లో బుక్ చేసుకోవడానికి తమ యొక్క ఫోన్ నెంబర్లను అప్డేట్ చేయించుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు . వరి పంటను కోసిన తర్వాత రైతులు వరి కొయ్యకాలను తగలపెట్టకూడదని తెలిపారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని తదనుగుణంగా ఎరువులు వాడాలని వివరించారు. రసానికి ఎరువులను అధికంగా వాడడం వల్ల భూతల్లి ఆరోగ్యము దెబ్బతింటుందని రైతులకు అవగాహన కల్పించారు. పచ్చి రొట్టె ఎరువులను జీలుగా, జనుము, పెసర, పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలని పూత దశకు వచ్చేముందు భూమిలో కలియదున్నాలని వివరించారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించినట్లయితే భూమి సారవంతం అవడంతో పాటు, అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు.

గ్రామస్థాయి నిగ్రాణి సమితి కమిటీలు గ్రామ సర్పంచ్ చైర్మన్ గా ఆరుగురు సభ్యులు సభ్యులుగా ఉండి గ్రామస్థాయిలో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, కృషి సఖి, డ్రోన్ దీదీ, ప్రోగ్రెసివ్ రైతు, పిఎసిఎస్ , ఎఫ్ పి ఓ ప్రతినిధి, గ్రామ వ్యవసాయ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గ్రామస్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు నకిలీలను అరికట్టడం, గ్రామస్థాయిలో భూసార పరీక్షలు ఆధారంగా ఎరువుల వాడకం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అక్రమ ఎరువుల రవాణా లేదా వ్యవసాయేతర మళ్లింపులపై నిగా ఉంచడం కల్తీ ఎరువులు విత్తనాలు వంటివి గ్రామంలో కనిపించినట్లయితే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయడం వంటి అంశాల పైన నిగ్రణి సమితి సభ్యుల పర్యవేక్షణ ఉంటుందని తెలియపరిచారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పడిన నిగ్రణి సమితి ఈ దిశగా రైతులకు తగు విషయాలను చేరవేయడంలో సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నన్నూరి భూపతి రెడ్డి , గ్రామ కార్యదర్శి నాగరాజు , ఆదర్శ రైతు నన్నూరి జితేందర్ రెడ్డి , దర్శనం లక్ష్మయ్య , దెందే మల్లేష్ , వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. నరసింహ గ్రామ రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana