Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రయోగాత్మక చిత్రాల్లో భిన్న పాత్రలు..

ప్రయోగాత్మక చిత్రాల్లో భిన్న పాత్రలు..

'డేవిడ్ రెడ్డి`వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్న సినిమా 'డేవిడ్ రెడ్డి`.

డైరెక్టర్ హనుమా రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ దసరా పండుగ సందర్భంగా విడుదలకు రెడీ అవుతోంది.మనోజ్ పుట్టినరోజు సందర్భంగా 'డేవిడ్ రెడ్డి' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మహాత్ముడి అహింసా మార్గానికి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకున్న డేవిడ్ రెడ్డి పాత్రలో మనోజ్ కనిపించబోతున్నారు.'వడ్డి కాసుల వాడ`మనోజ్ హీరోగా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల వాడ' సినిమాను ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'వడ్డీ కాసుల వాడ' టైటిల్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరి కాంబినేషన్ లో 2010లో 'బిందాస్` లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. మనచుట్టు, మన జీవితంలో ఈఎంఐలు భాగమై పోయాయి. అదే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందు తుంది. ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాదు గుండెను పిండేసే భావోద్వేగాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. తేజ్ ఉప్పలపాటి రచన, దర్శకత్వంలో పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నేతృత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

మంచు మనోజ్..
భిన్న పాత్రలు, సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసు కున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలకు, పాత్రలకూ కేరాఫ్ గా నిలిచారు. బుధవారం ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఇచ్చిన కొత్త సినిమాల తాలూకా అప్ డేట్స్ అభిమానులను సర్ర్పైజ్ చేశాయి.

బాలయ్య సినిమాలో పవర్ఫుల్ పాత్ర
'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్బస్టర్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో ఓ భారీ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రంలో మనోజ్ కీలక పాత్రలో నటించనున్నట్లు అధికా రికంగా ప్రకటించారు. 'మిరాయి'తో సెన్సేషనల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మనోజ్ ఇప్పుడు ఈ సినిమాలో రా ఇంటెన్సిటీ, డార్క్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మనోజ్ త్వరలోనే సెట్స్లో జాయిన్ కానున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana