Dailyhunt
ప్రేమలోని చీకటి కోణం..

ప్రేమలోని చీకటి కోణం..

'అగ్లీ స్టోరీ' ట్రైలర్ 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా విడుదల అయ్యింది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

డైరెక్టర్ ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ, 'ప్రతి ప్రేమకు ఓ చీకటి కోణం ఉంటుంది. ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం. మా నిర్మాతలు సుభాషిణి, లక్ష్మణ్ క్వాలిటీ విషయంలో రాజీపడలేదుఅని తెలిపారు. 'ఈ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్.

ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్తో నిండిన స్టోరీ ఇది. అవికా మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. డైరెక్టర్ ప్రణవ చాలా బాగా తీశారు అని హీరో నందు చెప్పారు. అవికా గోర్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ద్వారా ప్రేమ తాలూకా వాస్తవాలను చూపించా లనుకున్నాం.

ఈనెల 22న థియేటర్లలో కలుద్దాంఅని అన్నారు. 'సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ ప్రణవ పనితనాన్ని.. నందు, అవిక నటన చాలా బాగుంది. మా మూవీకి మొదటి నుంచి ఎంతో సహకారం అందించిన బెక్కం వేణు గోపాల్, ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్రకి కృతజ్ఞతలు అని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాకి సహ నిర్మాతలు : రాజ్ నాగ్, అశ్విని శ్రీకృష్ణ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana