Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రియుడితో భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త..అంతలోనే దారుణం

హైదరాబాద్ : బీహార్ లోని బేగూసరాయ్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. బేగూసరాయ్ కి చెందిన కుసుమ( పేరు మార్చాం)కి 2014లో అదే గ్రామానికి చెందిన చెందిన వ్యక్తితో పెళ్లయింది. పెళ్లికి ముందే కుసుమ తన క్లాస్ మేట్ షేక్‌ నాగూర్‌ ని ప్రేమించింది. కుసుమకి పెళ్లైన తర్వాత కూడా వీరి మధ్య బంధం అలాగే కొనసాగుతుంది. ప్రియుడు నాగూర్‌ పాట్నాలో వ్యాపారం చేసేవాడు. కానీ అప్పుడప్పుడు మధ్యమధ్యలో కుసుమ కోసం బేగూసరాయ్ లోని ఆమె తల్లిగారింటికి వచ్చి ఆమెను కలిసి వెళ్లేవాడని స్థానికులు చెప్తున్నారు. గతవారం కూడా నాగూర్ బేగూసరాయ్ వచ్చాడు. అయితే వీరిద్దరూ కలిసేందుకు కుసుమకు తెలిసిన స్నేహితుడు ఒకరు గది ఇచ్చారు.

భార్య తన ప్రియుడితో కలిసి ఉందన్న విషయం తెలుసుకున్న భర్త గ్రామస్థులతో కలిసి ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. గ్రామస్థులతో కలిసి చితక్కొట్టాడు. తమ బంధువుల ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు ఆనుకుని ఉన్న గదిలో బంధించారు.

అయితే అక్కడే వాళ్లిద్దరూ గదిలో ఉన్న ఎలుకల మందు మింగారు. కొద్దిసేపటికి గదిలో చూడగా కుసుమ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. అటు నాగూర్‌ కూడా మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయంతో వారే ఎలుకల మందు తిన్నారా.. లేదా వేరే ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana