Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుష్ప ట్యూన్లు సిద్ధం!

పుష్ప ట్యూన్లు సిద్ధం!

లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను దర్శక, నిర్మాతలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పూర్తి చేయడం విశేషం. వీరి బాటలోనే 'పుష్ప' చిత్ర బృందం ఉండటం మరో విశేషం. లాక్‌డౌన్‌ వల్ల ప్రత్యక్షంగా కలిసే వీలు లేకపోవడంతో దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ఇద్దరూ వీడియో కమ్యూనికేషన్‌ యాప్‌లను ఉపయోగించుకుని పాటలకు సంబంధించిన మ్యూజిక్‌ సెషన్‌లను నిర్వహించారట. ట్యూన్స్‌ ఎంపిక కూడా పూర్తి చేశారని సమాచారం. ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయని, వాటిల్లో సుకుమార్‌ సినిమాల్లో రెగ్యులర్‌గా ఉండే స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ 'పుష్ప' చిత్రీకరణలు ఇంకా మొదలవ్వలేదు.

అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈచిత్రంలో ఆయన సరసన రష్మిక మందన్నా నటిస్తున్నారు. అలాగే ఆర్టిస్టుల పరంగా ఈ చిత్రంలో పలు ప్రత్యేకలున్నట్టు వినిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana