Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుస్తక పఠనం విజ్ఞానానికి పునాది

పుస్తక పఠనం విజ్ఞానానికి పునాది

- సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్నవతెలంగాణ - ఆలేరు రూరల్

పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని కొలనుపాక గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ అన్నారు.

ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో విద్యా వారోత్సవాలు భాగంగా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ యాకమ్మ వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో యువత,విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.పుస్తకాలు మనిషిలో ఆలోచనా శక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానాన్ని విస్తరింపజేసి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని తెలిపారు.

సమాజ అభివృద్ధికి చదువు, విజ్ఞానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పుస్తకాలను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన పెరుగుతుందని చెప్పారు. యువత సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గొట్టం విజయేందర్ రెడ్డి, వార్డు సభ్యులు చిరబోయిన రమేష్, బోన్కూరి మల్లేష్,రాగం కరుణాకర్, రాజబోయిన కొండల్,మిట్టపల్లి సుభష్, గ్రంద పాలకులు ఆకుల ఆంజనేయులు,సంగు కిరణ్, మాసాపేట సోమరాజు, మామిడాల నరసింహులు, బిక్షపతి, పాషా, పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana