Dailyhunt
పుట్టిన బిడ్డకు నాయకుని పేరు

పుట్టిన బిడ్డకు నాయకుని పేరు

- కమ్మర్ పల్లిలో మొదటిసారి అరుదైన సంఘటననవతెలంగాణ-కమ్మర్ పల్లి

మ్మర్పల్లి గ్రామ సర్పంచ్గా కొత్తపల్లి హారిక అశోక్ ఎన్నికైన వేళ గ్రామంలో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

గ్రామంలో నాగువోతుల రాజి అనే మహిళ ఇటీవల ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. నామకరణం రోజున కొత్తపల్లి హారిక ​అశోక్ సర్పంచ్గా గెలిచిన సంతోషంలో, ఆయనపై ఉన్న అభిమానంతో రాజి అనే మహిళ తన కుమారుడికి అశోక్ సర్పంచ్ అని పేరు పెట్టారు. సాధారణంగా నాయకుల పేర్లు పెట్టుకోవడం చూస్తుంటాం, కానీ పదవితో సహా (సర్పంచ్ అని కూడా కలిపి) పేరు పెట్టడం ఆ నాయకుడిపై ఉన్న నమ్మకాన్ని, ఆత్మీయతను చాటిచెబుతోంది.​ ఒక సామాన్య మహిళా కార్మికురాలు తన బిడ్డకు సర్పంచ్ పేరు పెట్టడం అనేది ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇది సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కు దక్కిన గొప్ప గౌరవంగా గ్రామస్తులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana