Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజరాజేశ్వర ఆలయంలో సప్తమి వేడుకలు ప్రారంభం

రాజరాజేశ్వర ఆలయంలో సప్తమి వేడుకలు ప్రారంభం

వతెలంగాణ-కుభీర్మండలంలోని పార్డి (బి) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో బుధువారం ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో తాళ సప్తమి వేడుకలను సర్పంచ్ మడి ప్రవీణ్, ఆలయ కమిటీ అధ్యక్షులు వి.

మోహన్ పూజారి జంగం దత్తాత్రి రాజరాజేశ్వరునికి ప్రత్యేక పూజలతో సప్తమి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు కొనాగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ రాజరాజేశ్వరుని ఆలయం చాలా పురాతనమైనది చెప్పారు.

ఎన్నో ఏండ్ల కాలం నుంచి అనవయితీగా వస్తున్న ఆచారాన్ని ఇప్పటికి కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు ఆర్యవైశ్యలు, గ్రామస్తులు అన్నదానా కార్యక్రమాలు చేపట్టి చివరి రోజున శ్రీ కృష్ణుడికి ఉయ్యాల కట్టి నామకరణం చేస్తారని వివరించారు. అనంతరం ఉట్టి కొట్టె కార్యక్రమం చేపట్టి వేడుకలు ముగింపు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు సురేష్, ఆలయ కమిటీ సభ్యులు చిమ్మన్ పోశెట్టు, బి సంతోష్ నారాయణ్, బాబు, రమేష్,కానోబా, గణేష్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana