Saturday, 25 Sep, 5.45 pm నవ తెలంగాణ

హోం
రాజస్థాన్ లక్ష్యం.. 155 పరుగులు

హైదరాబాద్ : రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(10), ధావన్‌(8) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా ..ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌(43), రిషబ్‌ పంత్‌(24)లు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. అనంతరం హెట్‌మైర్‌ (28) ధాటిగా ఆడగా.. లలిత్‌ యాదవ్‌(14*) అతనికి సహకరించాడు. చివర్లో అక్షర్ పటేల్ 12 పరుగులు, అశ్విన్ 6* పరుగులు చేయగా ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
రాజస్థాన్ బౌలింగ్ లో ముస్తఫిజుర్, సకారియా చెరో రెండు వికెట్లు తీసుకోగా, త్యాగీ, థివాటియా లు చెరో వికెట్ తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top