హైదరాబాద్
'రాజ్యాంగం బాధ్యతలను గుర్తు చేస్తుంది'

- తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ జి.చంద్రయ్య
నవతెలంగాణ-నారాయణగూడ
రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేస్తుందని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్ బాగ్ లో న్యాయమూర్తులు జస్టిస్ వామన్ రావు, జస్టిస్ జి.యతిరాజులు, జస్టిస్ టి.రజనీలను శాలువాతో సత్కరించి, న్యాయ శిరోమణి అవార్డ్స్-2020ను జి.చంద్రయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం గురించి దేశ యువత సంపూర్ణంగా తెలుసుకోవాలని, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
అందరికీ సమన్యాయం అందినప్పుడే రాజ్యాంగం అమలైనట్లని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అక్తర్ అలీ, శివకుమార్, డాక్టర్ ఆర్.జయశ్రీ, డి.జయసుధ, యు.వి నాగలక్ష్మి, సుధాగాని లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
related stories
-
హెరాల్డ్ కార్డ్స్ శృతి హాసన్ గతంలో బిజినెస్ మ్యాన్, రెబల్, జెర్సీ, దువ్వాడ జగన్నాధం, అమర్ అక్బర్...
-
ప్రధాన వార్తలు థ్యాంక్ యూ బ్రదర్: ట్రైలర్ రిలీజ్
-
తెలంగాణ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది