Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రాంకీ'పై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

'రాంకీ'పై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

వహర్ నగర్ డంప్ యార్డు సందర్శనమరోసారి సమావేశం.. సీఎంకు సమగ్ర నివేదిక
నిబందనలను తుంగలో తొక్కిన రాంకీ : ఎంపీ ఈటల


నవతెలంగాన-సిటీబ్యూరో
జవహర్ నగర్ డంప్ యార్డ్ పై గురువారం నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు డంప్యార్డ్ను సందర్శించారు.

అనంతరం హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామ్కీ సంస్థ అనుసరిస్తున్న వ్యర్థాల నిర్వహణ విధానాలు, కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చించి వివరాలు తెలుసుకున్నారు. జవహర్ నగర్ ప్రాంతంలో నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడంపై ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రజల అభివృద్ధికి వినియోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana