Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైల్వే యూజర్ల సంప్రదింపుల కమిటీ భేటీ

రైల్వే యూజర్ల సంప్రదింపుల కమిటీ భేటీ

వతెలంగాణ-హైదరాబాద్హైదరాబాద్ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే యొక్క 74వ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం సికింద్రాబాద్లో జరిగింది.

ఈ సమావేశానికి హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ డి.ఎస్. రామారావు, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డా. అనిరుధ్ పమార్ తోపాటు హైదరాబాద్ డివిజన్కు చెందిన ఇతర బ్రాంచ్ అధికారులు ఈ బేటీకి హాజరయ్యారు.

నాలుగో కమిటీ సమావేశానికి నామినేట్ చేయబడిన 18 మంది సభ్యులలో, 10 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో చైర్మెన్ మాట్లాడుఊ 2025-2026 కాలంలో సాధించిన విజయాలను, అలాగే వివిధ అమృత్ స్టేషన్లలో పనుల స్థితితో సహా హైదరాబాద్ డివిజన్ వ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే డివిజన్లో పూర్తయిన ప్రయాణీకుల సౌకర్యాల పనులు, కొనసాగుతున్న పనుల గురించి కూడా చైర్మెన్ తెలియజేశారు. డివిజన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ పనులను పూర్తి చేయడానికి చేసిన కృషిని, అలాగే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపిక చేయబడిన స్టేషన్లలో కొనసాగుతున్న పనులను అభినందించారు. సంప్రదింపుల కమిటీ సభ్యులు ఈసందర్భంగా మాట్లాడుతూ కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలనీ, రైళ్లను ఆపాలనీ, ప్రత్యేక రైళ్లను నడపాలనీ, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమలులో ఉన్న మార్గదర్శకాలను పరిశీలించి సూచనలు, విజ్ఞప్తులను అమలుచేసే ప్రయత్నం చేస్తామని చైర్మెన్ హామీనిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana