Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు కష్టానికి కాపల లేక ఆవుల పాలైన అన్నదాతల శ్రమ

రైతు కష్టానికి కాపల లేక ఆవుల పాలైన అన్నదాతల శ్రమ

కొనుగోలు కేంద్రంలో ఆవులకు ధాన్యం విందు…నిర్వాహకుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం…
నవతెలంగాణ - కాటారం
:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లిలోని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూగజీవాలకు ఆహారంగా మారిన ఘటన సోమవారం కొనుగోలు కేంద్రంలో చోటుచేసుకుంది.

దేవరాంపల్లి గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు తమ పంటను విక్రయాల కోసం తీసుకువచ్చి కళ్లాల్లో ఆరబెట్టారు. అయితే కేంద్రం వద్ద సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సోమవారం ఆవుల గుంపు కొనుగోలు కేంద్రంలోకి దూసుకెళ్లి ధాన్యాన్ని తినేసింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను అమ్మే సమయానికి నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం మూగజీవాలకు ఆహారంగా మారడంపై రైతులు మండిపడుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల రైతుల ధాన్యం నష్టపోతుందని వారు ఆరోపిస్తున్నారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం రైతుల ఇబ్బందులను మరింత పెంచుతోంది. నిలువ నీడ లేక ఎండలోనే వేచి ఉండాల్సి వస్తోందని, తాగునీటి సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana