Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు - అన్నదాతల అవగాహన

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు - అన్నదాతల అవగాహన

వతెలంగాణ - సదాశివ నగర్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు- అన్నదాతల అవగాహన కార్యక్రమం ను కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలోని మోడెగా0 గ్రామంలో గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నుండి డా సంపత్ కుమార్ శాస్త్రవేత్త, వ్యవసాయ శాఖ, వ్యవసాయ అధికారి k. ప్రజాపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ వరిలో సన్న గింజ రకాలు, వాటి లక్షణాలు తెలుపుతూ రైతు సన్న గింజ రకాలు వేయడం ద్వారా బోనస్ పొందవచ్చని తెలిపారు.

పంట మార్పిడి, అవసరం అయిన మేరకే రసాయనాలు వాడటం గురించి తెలిపారు. మోతాదు ప్రకారం రైతులు యూరియా వాడాలని, సాగు ఖర్చు తగ్గించి నేల ఆరోగ్యం కాపాడాలని కోరారు. వానకాలం యాసంగికి అనువైన వరి సన్న రకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలు పండించాలని కోరారు. సేంద్రియ పద్ధతులు పాటించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని తెలిపారు. గ్రామ సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు పాటించి లాభం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు వారి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో AEO శ్రీలక్ష్మి, గ్రామ అభ్యుదయ రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana