Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులు ఆందోళన చెందొద్దు.. కొనుగోళ్లు వేగవంతం చేస్తాం

రైతులు ఆందోళన చెందొద్దు.. కొనుగోళ్లు వేగవంతం చేస్తాం

వడ్ల నిల్వకు గోడౌన్ల పరిశీలననవతెలంణ - కాటారం

కాటారం మండలంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్ల నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాటారం ఆర్డీవో రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల శుక్రవారం మండలంలోని శ్రీ రుద్రా జిన్నింగ్ మిల్, మీనాక్షి కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్ గోడౌన్లను పరిశీలించారు.

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో ఉన్న గోడౌన్ల సామర్థ్యాన్ని పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా వెంటనే తూకాలు వేయాలని, కొనుగోలు చేసిన వడ్లను ఆలస్యం లేకుండా గోడౌన్లకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పంతకాని తిరుమల, ఆర్ డి ఓ రవీందర్ మాట్లాడుతూ..రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి ధాన్యాన్ని సకాలంలో నిల్వ చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లారీల కొరత తలెత్తకుండా తగిన సంఖ్యలో వాహనాలను సిద్ధంగా ఉంచాలని పీఏసీఎస్ సెంటర్ ఇన్చార్జిలకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, పీఏసీఎస్ సతీష్, జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana