Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్యన్ మహిళకు వీసా పొడిగించండి హైకోర్టు

రష్యన్ మహిళకు వీసా పొడిగించండి హైకోర్టు

హైదరాబాద్: పిల్లలు లేని విదేశీ వితంతువులకు వీసా పొడిగింపు విషయంలో కఠిన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రత్యేక పరిస్థితుల్లో మానవీయ దష్టితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

భర్త మరణం అనంతరం భారతదేశంలోనే ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్న రష్యన్ మహిళకు వీసా పొడిగించాలని ఆదేశించింది.భారతీయుడిని వివాహం చేసుకున్న ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో, కర్మకాండలు నిర్వహించడం, వద్ధురాలైన అత్తకు తోడుగా ఉండడం వంటి కారణాలతో వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం పిల్లలు లేని విదేశీ వితంతువులకు వీసా పొడిగింపు ఇవ్వలేమని ఇమిగ్రేషన్ అధికారులు నిరాకరించారు.వీ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు, సాధారణంగా మార్గదర్శకాలు సరైనవే అయినప్పటికీ, అసాధారణ పరిస్థితుల్లో అధికారులు తమ విచక్షణాధికారాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మానవతా దక్కోణంలో ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.దీంతో, సంబంధిత మహిళకు ఎలాంటి జరిమానా విధించకుండా వీసా గడువు పొడిగించాలని ఇమిగ్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గడువులోపే దరఖాస్తు చేసుకున్నందున ఆమెపై ప్రతికూల చర్యలు తీసుకోవద్దని కూడా స్పష్టం చేసింది.

ఓవైసీ విద్యాసంస్థల నిర్మాణాలు కనపడడం లేదా ?
అధికారులను ప్రశ్నించిన హైకోర్టు

సల్కం చెరువు పరిధిలో ఓవైసీ విద్యాసంస్థలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్న నిర్మాణాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు అధికారులను తీవ్రంగా ప్రశ్నించింది. సామాన్యుల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించే అధికారులు ఇక్కడ మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహించారో వివరణ కోరింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అసమాన విధానం ఎందుకు అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏండ్లుగా కొనసాగుతున్న నిర్మాణాలకు సంబంధించి అనుమతుల విషయాన్ని అధికారులు పరిశీలించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. నిర్మాణాలు ప్రారంభం నుంచి పూర్తి అయ్యేంతవరకు పర్యవేక్షణ జరగకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొంది. అవసరమైతే గతంలో బాధ్యతలు నిర్వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.ఈ అంశంలో బాధ్యులైన అధికారులందరినీ గుర్తించి పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో ఆ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన సహాయం అందించాలని, అవసరమైతే ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం చర్యలు తీసుకోవాలని సూచించింది.శాటిలైట్ చిత్రాలు, పాత మ్యాపులను పరిశీలించిన కోర్టు, చెరువు ప్రాంతంలో గతంలో మార్పులు ఎలా జరిగాయన్న దానిపై ప్రాథమికంగా సందేహాలు వ్యక్తం చేసింది. కోర్టు జోక్యం తరువాతే అధికారులు కదలిక చూపినట్లు గమనించింది. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను జులై 3లోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana