Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండు గంటలు చర్చలు..సంతకం చేయని ట్రంప్

రెండు గంటలు చర్చలు..సంతకం చేయని ట్రంప్

వతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో శాంతి చర్చలపై ఊగిసలాట కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక పక్ష డిమాండ్లతో ట్రంప్ ఇరాన్ ను లొంగతీసుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు.

యూఎస్ అనుకూల డిమాండ్ల పత్రంపై తాము ఎట్టి పరిస్థితుల్లో సంతకాలు చేయబోమని ఇరాన్ స్పష్టం చేసింది. తాజాగా అమెరికా వైట్ హాస్లో జరిగిన సమావేశంలో ఇరాన్తో ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది ఆమోదం తెలపలేదు.

ఇరాన్తో ఒప్పందంపై చర్చించేందుకు, తుది నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ (Donald Trump) వైట్హౌస్ సిచ్యువేషన్ రూమ్లో తన సలహాదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. అయినప్పటికీ ఆ ఒప్పందంపై ట్రంప్ ఇప్పటివరకు అధికారికంగా సంతకం చేయడం గానీ, తుది ఆమోదం ప్రకటించడం గానీ జరగలేదు. ఈ డీల్పై సంతకం చేయకుండానే ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారని సీఎన్ఎన్ కథనం వెలువరించింది.

కాగా, ట్రంప్ ఈ డీల్పై పూర్తి సంతృప్తిగా లేరట. ఇరాన్తో కుదిరే ఏ ఒప్పందమైనా అది అమెరికాకు మేలు చేసిదిగా ఉండాలని, అధ్యక్షుడు ట్రంప్ను సంతృప్తిపరచాలని, అప్పుడే ఆయన తుది ఆమోదం తెలుపుతారని వైట్హౌస్ అధికారి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana