Dailyhunt
రేపు 'ఆర్టీసీ పరిరక్షణ' దినం

రేపు 'ఆర్టీసీ పరిరక్షణ' దినం

జయప్రదానికి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఆర్టీసీ పరిరక్షణ దినం' మంగళవారం నిర్వహిస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటి తెలిపింది.

ఈ మేరకు ఆదివారం ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ బస్ల విధానం వల్ల ఆర్టీసీ ప్రమాదంలో పడిందని తెలిపారు. బస్ భవన్లోని 'ఎ' బ్లాక్ను తెలంగాణ కమర్షియల్ టాక్స్ (జీఎస్టీ ) డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందనీ, దీంతో ఆర్టీసీ భవనాలు, ఆస్తుల పరిరక్షణ కూడా ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని కాపాడుకోవటం కోసం మంగళవారం ఆర్టీసీ పరిరక్షణ దినంగా పాంటించనున్నట్టు తెలిపారు. ఆయా డిపోల్లోని కార్మికులు, ఉద్యోగులు ప్రింటెడ్ బ్యాడ్జెస్ ధరించి, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కలిసి వచ్చే కార్మిక సంఘాలతో నిరసన కార్యక్రమాలు చేయాలని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana