Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు సిరిసిల్లకు డిప్యూటీ సీఎం భట్టి

రేపు సిరిసిల్లకు డిప్యూటీ సీఎం భట్టి

వతెలంగాణ-రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పోన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేర్కొన్నారు.

ఈనెల 5న ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల పర్యటన ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12:15 గంటలకు గంభీరావుపేట గ్రామానికి మంత్రుల బృందం చేరుకుని, గంభీరావుపేటలో అధికారులు, అనధికారులతో మంత్రుల కీలక సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం 12:20 నుండి 1:30 వరకు 'బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్' కంప్రెసెడ్ బయో గ్యాస్ ప్లాంట్కు భూమిపూజ, గంభీరావుపేటలో రైతులతో ముఖాముఖి, మధ్యాహ్నం 2:00 గంటలకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 33/11 KV సబ్స్టేషన్లకు శంకుస్థాపన, మధ్యాహ్నం 2:30 నుండి 4:00 గంటల వరకు పీజీ సెంటర్లో జిల్లా అభివృద్ధి పనులపై మంత్రుల సమీక్షా సమావేశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana