Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు ప్రమాదంలో సీఐ దంపతులు మృతి

రోడ్డు ప్రమాదంలో సీఐ దంపతులు మృతి

హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌ మెట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టగా.. దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌, ఆయన భార్య ఝాన్సీగా గుర్తించారు. లక్ష్మణ్‌ సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాద సమయంలో ఝాన్సీ కారు నడిపినట్లుగా గుర్తించారు. దంపతులతో పాటు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డాడు. సూర్యాపేట నుంచి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana