Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరు

రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరు

వతెలంగాణ - మల్హర్ రావుకాటారం సబ్ డివిజన్ పరిధిలోని మల్హర్ మండల కేంద్రమైన తాడిచర్ల,కాటారం, మాహాముత్తారం, మహదేవపూర్ మండలంలోని రోడ్ల మరమ్మతులకు హ్యామ్ పథకం కింద రూ.141.63 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

కొయ్యూరు నాగులమ్మ క్రాస్ నుంచి తాడిచర్ల (12.92 కిలోమీటర్లు) వరకు రూ.15.02 కోట్లు, తాడిచర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి (2.50 కిలోమీటర్లు) వరకు రూ.2.50 కోట్లు మంజూరయ్యాయి. కాటారం మండలం ప్రతాపగిరి నుంచి బొప్పరాం(8 కిలోమీటర్లు) వరకు రూ.7.02 కోట్లు, మహాముత్తారం మండలం పెగడపల్లి నుంచి మేడారం (19.20 కిలోమీటర్లు) వరకు రూ.22.23కోట్లు, మహదే వపూర్ నుంచి ముకునూర్ వరకు 30 కిలోమీట ర్లకు వరకు డబుల్ రోడ్డు, 20 కిలోమీటర్లు సిం గిల్ లేయర్ (మొత్తం 52 కిలో మీటర్లు)కు రూ 95.17 కోట్లు నిధులు మంజూరయ్యాయి.త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana