Tuesday, 11 Aug, 12.47 am నవ తెలంగాణ

రాష్ట్రీయం
రూటు మార్చిన కరోనా....

- ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వారంలో రెట్టింపు
- సౌకర్యాల కల్పనపై పెరిగిన హడావుడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో కరోనా దిశను మార్చుకున్నది. ఇంత కాలం జీహెచ్‌ఎంసీని హడలెత్తించిన ఈ కేసులు ప్రస్తుతం జిల్లాలను వణికిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో ఐదు నుంచి 10 శాతం లోపు పాజిటివ్‌ రేటు నమో దవుతుండగా, జిల్లాల్లో మాత్రం క్రమక్రమంగా పెరు గుతున్నది. గత 10 రోజులుగా ఒకట్రెండు చోట్ల తప్ప మిగిలిన అన్ని కేంద్రాల్లో బాధితుల సంఖ్య రోజుల గడుస్తున్నా కొద్ది రోగులు పెరుగు తుండ డంతో ఆందోళన నెలకొన్నది. జిల్లాల వారీ గణాం కాల ఆధారంగా రానున్న కొద్ది రోజుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా కేసులు భారీగా వెలు గు చూసే అకాశముందని వైద్యారోగ్యశాఖ అం చనా. కాగా ఇప్పటి వరకు నామమాత్రపు సేవ లకే పరి మితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తే తప్ప మెరుగైన చికిత్సను అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఆగస్టు ఒకటిన జీహెచ్‌ఎంసీ పరిధిలో 517 కేసులు రాగా తాజాగా463కు తగ్గా యి. ఉదాహ రణకు మహబూబ్‌నగర్‌లో 33 నుంచి 43కు, నల ్లగొండ 46 నుంచి 59కి ఎగబా కాయి. మరికొన్ని జిల్లాల్లో ఒకే రకంగా కేసులు నమో దవు తూ వస్తున్నా యి. ఖమ్మంలో ఆగస్టు ఒకటిన 47 ఉండగా తాజా గా కూడా 47 ఉన్నాయి. గత వారం రోజులు గా కొత్త జిల్లాల కేంద్రాలు, ముఖ్యం గా పట్ట ణాలను వైరస్‌ చుట్టుముడుతున్నది. భద్రాద్రి కొత్త గూడెంలో 16 నుంచి 64కు, జనగామలో 13 నుం చి 78, భూ పాలపల్లి జయశంకర్‌ జిల్లాలో 12 నుం చి 21కి, గద్వాలలో 12 నుంచి 93కు, కామా రెడ్డిలో 22 నుంచి 62, మంచిర్యాలలో ఒక కేసు నుంచి 31, ములుగులో 14 నుంచి 21కి పెరిగితే మంచి ర్యాల లో ఏకంగా రెండు కేసుల నుంచి 47కు చేరడం గమనార్హం.
మూడు దశల్లో కరోనా వ్యాప్తి
కరోనా వ్యాప్తి మూడు దశల్లో ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో పెరుగుదల దశ దాటి స్థిరంగా ఉందనీ, ఇది క్రమేణా బలహీనపడి కేసులు కూడా తక్కువగానే వస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో జిల్లాల్లో స్థాయిలో పెరుగుతున్నాయనీ, ఈ దశలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా, ఏరియా ఆస్పత్రుల స్థాయిలో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల స్థా యిలో కూడా ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచేం దుకు వైద్యారోగ్యశాఖ హడావుడీ చేస్తున్నది. ఈ పను లను మరింత వేగవంతం చేస్తే తప్ప పట్టణ ప్రాం తాల్లో జరిగిన నష్టం పునరావతం కాకుండా ఉంటుం దని పలువురు సూచిస్తున్నారు.
జాగ్రత్తలే శిరోధార్యం : తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లకపోవ డం, వెళ్లిన సమయంలో మా స్కు ధరించడం, పిల్లలు, వద్ధులు, దీర్ఘకాలిక వ్యాధు లతో బాధపడు తున్న వారు జాగ్రత్తలు తీసుకో వడమే ఉత్తమ మని డాక్టర్స్‌ ఫర్‌ సేవా ప్రతినిధి డాక్టర్‌ పి.శ్రీకాంత్‌ సూచించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana

related stories

Top