Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రుతురాజ్ గైక్వాడ్కు భారీ జరిమానా

రుతురాజ్ గైక్వాడ్కు భారీ జరిమానా

వతెలంగాణ - హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు జరిమానా పడింది. గుజరాత్ టైటాన్స్తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఫైన్ పడింది.

చెన్నైతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు 89 రన్ష్ తేడాతో విజయం సాధించింది. దీంతో అయిదు సార్లు చాంపియన్ అయిన చెన్నై ప్లే ఆఫ్స్కు అర్హత కోల్పోయింది. చెన్నై జట్టు రెండో అఫెన్స్గా భావిస్తూ .. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 కింద జరిమానా విధించారు. గైక్వాడ్కు 24 లక్షల ఫైన్ వేసినట్లు ఐపీఎల్ తన ప్రటకనలో తెలిపింది. చెన్నై జట్టులోని మిగితా సభ్యులకు, ఇంపాక్ట్ ప్లేయర్కు కూడా 6 లక్షల జరిమానా లేదా 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించనున్నట్లు ఐపీఎల్ తన ప్రకటనలో చెప్పింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana